రష్మిక డీప్ ఫేక్ వీడియో షేర్ చేసిన ఆ వ్యక్తి వయసెంతో తెలుసా… తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!!

రష్మిక ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది అభిమానులని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఈ బ్యూటీ పై ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఈ వీడియో పై కేంద్రం స్పందించడంతో పాటు ఢిల్లీ మహిళ కమిషన్ కూడా దృష్టి పెట్టింది.

దీంతో ఎట్టకేలకు ఆ డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసిన బీహార్ కు చెందిన యువకుడిని పట్టుకున్నారు. నిజానికి రష్మికకు సంబంధించిన ఈ ఫేక్ వీడియో క్రియేట్ చేసింది మాత్రం ఇతను కాదు. కానీ మొదట సోషల్ మీడియాలో షేర్ చేసింది మాత్రం ఇతనే. ఇతడి వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే.. ఈయన వయసు చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. గట్టిగానే విచారిస్తున్నారు.

ఈ వీడియో ఎక్కడ దొరికింది? అనే వివరాలు అడగగా మరొక సోషల్ మీడియా నుంచి ఓ వీడియోని డౌన్లోడ్ చేసినట్లు గా సదరు యువకుడు తెలిపాడు. ఇక ఇప్పటివరకు ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయలేదు. కానీ అనుమానిస్తున్న వారిని మాత్రం విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.