అల్లు అర్జున్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ లో ఓ అమ్మాయికి మెసేజ్ చేశాడంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బన్నీ తనకు మెసేజ్ చేశాడని.. ఆ అమ్మాయి ఆ స్క్రీన్ షాట్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తెగ సంబరపడిపోతుంది. అసలు ఈ అమ్మాయి ఎవరు? బన్నీకి ఏమవుతుంది? అసలు ఈమెకి బన్నీ ఏం మెసేజ్ చేశాడో ఇప్పుడు చూద్దాం.
సోషల్ మీడియాలో కరోలిన్ పిక్స్ పేరీటి ఓ ఖాతా ఉంది. విదేశీ అమ్మాయిలానే కనిపిస్తుంది. ఆమె ఫోటోలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఎంతో క్యూట్ గా ఉందని, హెయిర్ స్టైల్ బాగుందని.. రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. ఆమెకు రెండు లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నారు. ఈ అమ్మాయికి మన అల్లు అర్జున్ పర్సనల్ గా మెసేజ్ చేసినట్లు స్క్రీన్ షాట్ ఒకటి షేర్ చేసింది.
” మీ ఫోటోలు, పోస్ట్లు ఎంత క్యూట్ గా, ఫన్నీగా ఉన్నాయో.. గాడ్ బ్లెస్ .. ఇలానే ముందుకు వెళుతూ ఉండు “అంటూ బన్నీ మెసేజ్ పెట్టినట్లు స్క్రీన్ షాట్ లో కనిపిస్తుంది. అయితే ఈ అమ్మాయిని హీరో నవదీప్ కూడా ఫాలో అవుతున్నాడు. ఆమెను తన నెక్స్ట్ సినిమాలో ఏమైనా రోల్ కి సజెస్ట్ చేసి ఉంటాడా? అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .