సాధారణంగా మహేష్ బాబు ఏ ఇంటర్వ్యూలోను హద్దులు మీరి మాట్లాడడు. చాలా సరదాగా జోబియల్ గానే మాట్లాడుతూ ఉంటారు . ఈవెన్ రిపోర్టర్స్ ఆయనను టార్గెట్ చేసి ప్రశ్నించాలి అనుకున్న అదే విధంగా నవ్వుతూనే సమాధానం ఇచ్చి రాడ్ దించేస్తాడు . అలాంటి స్పెషల్ టాలెంట్ మన మహేష్ బాబుకు ఉంది . అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాత్రం తాను నటించిన సినిమాలలో ఏ సినిమా తనకు నచ్చలేదు అని హోస్ట్ ప్రశ్నించగా బ్రహ్మోత్సవం సినిమా అంటూ డైరెక్ట్ గా సినిమా పేరును కూడా చెప్పేసారు .
మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . హిట్లు ఉన్నాయి ఫ్లాప్ లు ఉన్నాయి . అయితే ఆయనకు నచ్చని సినిమా అంటే ఏది అని అడిగితే మాత్రం మొదటిగా చెప్పేది బ్రహ్మోత్సవం. అంతేకాదు ఈ సినిమా ఆయనకు చాలా హిట్ ఇస్తుంది అంటూ ఆశపడి మరి చేశారట . కానీ ఈ సినిమా జనాలకు అస్సలు నచ్చలేదు.
అందుకే ఫ్లాప్ అయిపోయింది . అంతేకాదు కొన్ని సీన్స్ తెర పై చూస్తూ ఉన్న అప్పుడు మహేష్ బాబు సైతం ఈ సినిమా ఎందుకు చేశాను రా బాబు అనేంతలా కోపం వచ్చేసిందట . అందుకే కర్మ ఖాళీ సినిమా చేశాను అంటూ మహేష్ బాబు తన క్లోజ్ ఫ్రెండ్స్ ముందు ఎప్పుడు ఈ సినిమా గురించి టాపిక్ వచ్చిన కామెంట్ అలానే చేస్తూ వస్తాడట..!!