బుల్లితెర కు పాకిన విడాకుల వైరస్.. భార్యకు డివర్స్ ఇవ్వబోతున్న స్టార్ సీరియల్ నటుడు..!

విడాకులు ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ దక్కించుకున్న పదం . ఒకప్పుడు విడాకులు అంటే ఏంటో జనాలకు అస్సలు తెలియదు . అయితే ఇప్పుడు విడాకులు అన్న పదానికి నేటి జనరేషన్ ఎక్కువగా అలవాటు పడిపోయింది . కోపం వస్తే విడాకులు ..మాట వినకపోతే విడాకులు ..మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోతే విడాకులు ..అడిగింది తీసి ఇవ్వకపోతే విడాకులు .. ఇలా చిన్న చిన్న విషయాలకి కూడా విడాకులు తీసుకుంటూ దూరమైపోతున్నారు కొందరు భార్యాభర్తలు .

కాగా రీసెంట్గా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ ప్రముఖులు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే . అయితే ఈ విడాకులు అనే వైరస్ వెండి తెర నుంచి బుల్లితెరకు పాకేసింది బుల్లితెరపై సీరియల్ లో స్టార్ నటుడుగా రాజ్యమేలేస్తున్న ఓ సీరియల్ హీరో త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ..ఈ సీరియల్ హీరో భార్య కూడా సీరియల్స్ లో నటిస్తుంది. అయితే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగానే విడాకులు తీసుకోబోతున్నారు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది . ఇప్పటికే విడాకులకు సంబంధించి పిటిషన్ కూడా ఫైల్ చేశారట . దీంతో ఫ్యాన్స్ తెగ బాధ పడిపోతున్నారు..!!