రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి అదే కారణమా… బయటపడ్డ అసలు గుట్టు…!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఒకడు. ఈయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఇక అందరిలాగానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈయన… పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాడు. అంతేకాదు ఈయన నటించిన పలు సినిమాలు కొన్ని వివాదాల వల్ల ఆగిపోవడం కూడా జరిగింది.

దీంతో హీరోగా సక్సెస్ అందుకున్నటువంటి రాజశేఖర్.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే నితిన్ హీరోగా నటిస్తున్న” ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ” మూవీలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఇలా ఆయన సడన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి కారణం ఏంటి అనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈయన కుమార్తె హీరోయిన్ శివాని తన మూవీ ప్రమోషన్స్ లో వెల్లడించిందేమిటంటే..” నాన్నకు ఎప్పటినుంచో నెగిటివ్ క్యారెక్టర్స్, విలన్ రోల్స్ లో నటించాలని కోరికగా ఉండేది.

విజయ్ సేతుపతి, అరవిందస్వామి, జగపతిబాబు వంటి వారి తరహాలో నాన్న కూడా నెగిటివ్ పాత్రలలో మెప్పించాలని అనుకున్నారు. ఆయన కోరుకున్నట్టుగానే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో విలన్ అవకాశం రావడం జరిగింది. ఇందుకు నాన్న కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశారు ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శివాని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.