మంగళవారం సినిమాను వదులుకున్న ఆ అన్ లక్కి హీరోయిన్ ఎవరో తెలుసా..? దరిద్రం అంటే ఇదే..!!

మంగళవారం పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది . ఈ సినిమా రిలీజ్ కంటే ముందే హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి అని అందరికీ తెలిసిందే. కాగా అజయ్ భూపతి దర్శకత్వం ఈ సినిమాకి మరింత ప్లస్ పాయింట్ అయింది.

పాయల్ ఈ సినిమాలో చాలా బోల్డ్ గా కనిపించడం కూడా ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం అంటున్నారు అభిమానులు . ఈ సినిమా తర్వాత పాయల్ రాజ్ పుత్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు . అయితే ఈ సినిమాని మొదటగా అజయ్ భూపతి హీరోయిన్ శ్రద్ధ దాస్ తో తెరకెక్కించాలని అనుకున్నారట .

కథ కూడా వివరించారట . కానీ కథ మరి టూ బోల్డ్ గా ఉండడంతో కొన్ని సీన్స్ కూడా అభ్యంతర కరంగా ఉండడంతో ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నిజంగా ఒకవేళ శ్రద్ధాదాస్ ఈ సినిమా చేసుంటే బోల్డ్ బ్యూటీ అని పేరు పడినా సరే కచ్చితంగా ఆమె ఖాతాలో హిట్ అయితే పడుండేది అంటున్నారు అభిమానులు..!!