సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిని చంప చెల్లుమనేలా కొట్టి పంపించేసిన నటుడు… పొగరు నెత్తికెక్కింది అంటూ కామెంట్లు…!!

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ నానా పటేకర్ ఓ అభిమాని సెల్ఫీ కోసం వస్తే చెంప చెల్లుమనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నటుడు భారీ విమర్శలలో చిక్కుకున్నాడు. అయితే దీనిపై స్పందించిన ఈయన..” అది మిస్టేక్ లో జరిగింది. దానిని పెద్ద ఇష్యూ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. అప్ కమింగ్ ఫిల్మ్ ‘జర్నీ ‘ షూటింగ్లో భాగంగా ఇలా జరిగింది.

మూవీలో స్లాపింగ్ సీన్ ఉంది. అప్పటికే ఒకసారి రిహార్సల్ జరగగా.. రెండోసారి రిహాసన్ చేద్దామని డైరెక్టర్ అనిల్ శర్మ కోరాడు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయి నా దగ్గరికి రావడంతో కొట్టేసాను. ఆ తరువాతే అర్థమైంది అతను తమ క్యూ నెంబర్ కాదని ” అంటూ తెలిపాడు. అంతేకాకుండా అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సైతం కోరాడు.

కాగా ఇంతకు ముందే ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అనిల్ శర్మ.” నానా పటేకర్ ఎవ్వరిని కొట్టలేదు. తమ సినిమాలోని ఒక షాట్ అది. దీన్ని ప్రాబ్లమేటిక్ గా క్రియేట్ చేయొద్దు. మేము ప్రస్తుతం బనారస్ లో ” జర్నీ ” సినిమా షూటింగ్ చేస్తున్నాం ” అంటూ అనిల్ శర్మ తెలిపాడు. అనిల్ శర్మ ఎంత చెప్పినప్పటికీ ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోకుండా…” పొగరు నెత్తికెక్కింది ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.