NBK-110 చిత్రం నుంచి కేక పెట్టిస్తున్న బాలయ్య లుక్స్..!!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారని చెప్పవచ్చు.. వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలతో 100 కోట్ల క్లబ్బులో చేరి ఈ వయసులో కూడా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న బాలయ్య తన తదుపరి చిత్రాలను కూడా అంతే ఫుల్ జోష్తో నిర్మిస్తూ ఉన్నారు. మంచి లైన్ అప్ తో పాటు యంగ్ డైరెక్టర్లకు కూడా అవకాశాలు ఇస్తూ బిజీగా ఉన్నారు బాలకృష్ణ.. బాలయ్య 109వ చిత్రాన్ని సైతం డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే బాలయ్య 110 చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో గత కొన్ని గంటల నుంచి ఒక పోస్టర్ వైరల్ గా మారుతోంది. బాలయ్య యుద్ధంలో ఉండే ఒక రాజు గెటప్ లో సీరియస్ వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఒక పోస్టర్ నెట్టింట వైరల్ గా మారడంతో పాటు బాలయ్య -110 #BatteloBreaths అనే హ్యాష్ టాగ్ ను కూడ వైరల్ గా మారుతోంది.

గతంలో ఎప్పుడూ కూడా బాలయ్యని ఇలా చూడలేదంటూ ఈ పోస్టర్ చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ గా ఈ ఫోటోను అభిమానుల చేశారని పలువురు నెటిజెన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. బాలకృష్ణ 110వ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ సైతం ఎవరు ప్రకటించలేదు. మరి ఈ పోస్టర్ కథ ఏమిటి ఎందుకు వైరల్ చేస్తున్నారని విషయంపై బాలయ్య టీమ్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. అందుకు సంబంధించి ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది.