రాఘవ లారెన్స్ జిగర్ తండా మూవీ ట్రైలర్ రిలీజ్.. ఈసారైనా సక్సెస్ అయ్యేనా..?

తమిళంలో సూపర్ హిట్ కొట్టిన జిగర్ తండా సినిమా సుమారుగా విడుదలై 10 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫ్రీక్వెన్ ని సిద్ధం చేయడం జరిగింది. జిగర్తాండ డబుల్ ఎక్స్ అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రాఘవ లారెన్స్ ఎస్ జె సూర్య నటిస్తూ ఉన్నారు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం ఈ చిత్రానికి వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.

Jigarthanda DoubleX Trailer Talk: A Karthik Subbaraj's 1975 Gangster Padam

ట్రైలర్ విషయంలోకి వస్తే పాన్ ఇండియాలో ఇప్పుడు వచ్చే సినిమాలలో అతని లాంటి ఒక నల్లని హీరోని ఊహించుకొని చూడండి చూద్దాం అంటూ ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది.. అప్పుడే రాఘవ లారెన్స్ నలుపు అంటే అంత చులకన నీకు అని బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో చెబుతారు.. ఈ ట్రైలర్లో ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ కథ ఏంటి అనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ మొత్తానికి ఈ సినిమాలో కూడా సినిమా షూటింగ్ ఉండేలా కనిపిస్తోంది.

1975లో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమాకి ఫ్రీక్వెల్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు నటుడు రవిచంద్ర, మలయాళ నటుడు షైన్ టైం చాకో విలన్ గా కనిపించారు. చివరిగా ఎస్ జె సూర్య చెప్పే డైలాగ్ మంచోళ్లపై సినిమా తీస్తే ఎవరు చూడరమ్మ అని చెప్పడంతో ఈ డైలాగ్ హాట్ టాపిక్ గా మారేలా ఉంది.. ఈ సినిమా తమిళంలో తెలుగు, హిందీ ,కన్నడ, మలయాళం భాషలలో ఒకేసారి నవంబర్ 10వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది .మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ మాత్రం వైరల్ గా మారుతున్నది.