కీలకమైన డీల్స్ క్లోజ్ చేసిన నాని ‘ హాయ్ నాన్న ‘ ..

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దసరా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని ప్రస్తుతం మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా బేబీ కియారా కీలకపాత్రలో నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఎప్పటికప్పుడు నాని తన రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వస్తున్నాడు నాని. దానికి కారణం అతడి నాన్ ధియేటర్ మార్కెట్. ఎప్పటికప్పుడు నాని నాన్ దియ‌ట్రిక‌ల్‌ మార్కెట్ రేంజ్‌లో చాలా స్ట్రాంగ్ అవుతున్నాడు నాని.

మరీ ముఖ్యంగా నాని సినిమా దక్కించుకుంటే రేటింగ్ గ్యారెంటీ అనే నమ్మకం టీవీ చానల్స్ వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ఈ సినిమాను దక్కించుకోవడానికి ఎంత భారీ రేటైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. రీసెంట్ గా హాయ్ నాన్న శాటిలైట్ ఢిల్లీ క్లోజ్ అయింది. జెమినీ ఛానల్ ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ డీల్ క్లోజ్ అయిన తర్వాత మూవీ ప్రమోషనల్ ఈవెంట్ స్పీడ్ మరింతగా పెంచింది. నాని నటించిన మూవీలో శాటిలైట్ డీల్స్ అన్నింటినీ వరుసగా సన్ నెట్‌వ‌ర్క్ దక్కించుకుంటుంది.

ఇంతకుముందు వరకు నాని నటించిన మూడు సినిమాల హక్కులను జెమినీ దక్కించుకుంది. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా మూవీల శాటిలైట్ హక్కులను దక్కించుకున్న ఈ కంపెనీ ఇప్పుడు హాయ్ నాన్న శాటిలైట్ రైట్స్ కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా కోసం నాని తన కెరీర్లో తీసుకొని హైయెస్ట్ రెమ్యూనరేషన్ పుచ్చుకున్నాడంటూ సమాచారం. దీంతో మూవీ బడ్జెట్ కూడా భారీగా పెరిగిందట. అయినప్పటికి నాన్ దియ‌ట్రికల్‌తో ఈ సినిమా ఈజీగా గ‌ట్టెకేస్తుంది అని అంచనాలు ఉన్నాయి. ఇక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.