ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ అరెస్ట్.. మహిళ జర్నలిస్ట్ పై అసభ్య ప్రవర్తనే కార‌ణమా..?

తాజాగా ఒడియా సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నిర్మాత సంజయ్ నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా జర్నలిస్ట్ పై దాడి చేసిన కేసులో నిర్మాతను శనివారం పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన సినిమా ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న టూటూ నాయక్గా పేరు తెచ్చుకున్న ప్రొడ్యూసర్ తనను వెనుక భాగం మీద కొట్టి నవ్వుతూ అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించాడని.. ఖారవేల నగర పోలీస్ స్టేషన్ లో మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేసింది.

నా చేతిలో నుంచి నా మైక్, మొబైల్ ఫోన్ క్రింద పడిపోయింది. నేను అది తీసుకోవడానికి కిందకి వంగినప్పుడు ఆయన నా వీపుపై కొట్టాడు. అతను ఎందుకు అలా ప్రవర్తించాడో నాకు అర్థం కాలేదు.. అని ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె ఆరోపణ ఆధారంగా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 341, 323, 294, 354 కింద కేసు నమోదు చేయబడింది.

ఈ విషయంపై ఖారవేలు నగర పోలీస్ ఇన్‌చార్జ్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్ మిశ్రా మాట్లాడుతూ నిందితుడి పై ప్రాథమికంగా కేసు నమోదు చేశామని వివరించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.