బతికుండగానే చంపేశారు ఎమోషనల్ అవుతున్న జబర్దస్త్ కమెడియన్..!!

జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా ఈ కమెడియన్స్ వేసే పంచ్ కామెడీ టైమింగ్ అన్ని కూడా ప్రేక్షకులకు నచ్చుతూ ఉన్నాయి. అదేవిధంగా కమెడియన్ ఇమ్మాన్యుయేల్ కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. సొంతంగా టాలెంట్ తో పైకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపున అందుకున్నారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ కమెడియన్ ఇటీవలే ఒక వెబ్ సిరీస్ లో నటించారు.

ఆ వెబ్ సిరీస్ ఏ ప్రేమ వాలంటీర్.. అయితే ఈ సిరీస్ క్లైమాక్స్లో ఇమ్మాన్యుయేల్ పాత్ర చనిపోయినట్టుగా కనిపిస్తుంది. కొన్ని ఊరు పేరులేని పలు రకాలు యూట్యూబ్ ఛానల్స్ మాత్రం ఇమ్మాన్యుయేల్ నిజంగానే మరణించారంటూ థంబ్ నైల్స్ పెట్టి పలు రకాల ప్రచారం చేయడం జరుగుతోందట. అయితే ఇదంతా కేవలం వ్యూస్ కోసమే హద్దులు దాటి ప్రచారం చేస్తున్నారని బాధపడుతూ ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ గా తెలియజేశారు. ఎదుటి వారి గురించి ఆలోచించకుండా ఇలా చేయడం చాలా బాధాకరంగా ఉందని తెలియజేశారు.

ఇమ్మాన్యుయేల్ మరణిస్తే వర్ష ఏడుస్తున్నట్లుగా తంబ్ నెయిల్స్ పెట్టి ప్రచారం చేస్తున్నారని వాపోతున్నారు. ఈ విషయంపై ఇమ్మాన్యుయేల్ తెలుపుతూ తాను బతికే ఉన్నారని కానీ బతికుండగానే చనిపోయారంటూ రాస్తున్నారు.. అది కేవలం ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్లో సిన్ అంటూ ఎమోషనల్ అయ్యారు ఇమ్మాన్యుయేల్.. కేవలం ఈ వెబ్ సిరీస్ లోని ఒక ఎండింగ్ వీడియోను తీసుకొని ఇలా ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చాలా ఆగ్రహానికి గురయ్యారు ఇమ్మాన్యుయేల్.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.