స్కంద సినిమా ట్రోల్స్ పై ఫోటోతో చెక్ పెట్టిన రామ్..!!

గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా స్కంద సినిమా పైన విపరీతమైన ట్రోలింగ్స్ ఎదురవుతూనే ఉన్నాయి. ఇందులోని కొన్ని యాక్షన్ సన్నివేశాల పైన మీన్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా హీరో రామ్ పోతినేని ఫైటింగ్ సన్నివేశాలు చాలా ఫన్నీగా ట్రోల్ చేస్తూ ఉన్నారు పలువురు నెటిజన్స్. అంతేకాకుండా గత రెండు రోజుల నుంచి డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు సంబంధించిన ఎలాంటి విషయాలైనా సరే ఫోటోలతో షేర్ చేస్తూ ఉన్నారు.

అయితే ఒక ఫైట్ సీన్లో భాగంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను చేసిన ఒక ఫోటోను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా హీరో రామ్ పోతినేని ఈ ట్రోలింగ్ పైన స్పందించారు.. ఈ సినిమా కోసం తాను ఎంత కష్టపడ్డానో చెబుతూ గాయపడిన తన పాదాల ఫోటోలను షేర్ చేయడం జరిగింది.. ఆ ఫైటింగ్ సన్నివేశం ఇంకా గుర్తుంది ఆ సీన్ లో సరిగ్గా నడవలేకపోయానని పాదాల నుంచి రక్తం వస్తున్నదని సోషల్ మీడియాలో రాసుకు రావడం జరిగింది.

22-4-23 నాకు ఈ తేదీ గుర్తుంది వేసవికాలం చాలా వేడిగా ఉండే రోజులలో ఇది కూడా ఒకటి మొత్తం 25 రోజులపాటు షెడ్యూల్ నిర్వహించాము అది మూడవరోజు మాత్రమే ఈ ఎపిసోడ్ ని షూట్ చేసిన తర్వాత తాను సరిగ్గా నడవలేకపోయారని తెలిపారు. అలా బలవంతంగా నడిచినప్పుడు పాదాల నుంచి రక్తం వచ్చిందని అందుకే ఆ సీన్ ఎలా రావాలి ఎలా నటించాలనే విషయాన్ని డైరెక్టర్ స్వయంగా చూపించారని..కంటెంట్ ఇష్టపడడం లేదా ఇష్టపడకపోవడం వంటిది కేవలం పూర్తిగా ప్రేక్షకుల ఎంపిక ..నేను మీ అభిప్రాయాలను ఎప్పుడు గౌరవిస్తాను కానీ నా కోసం స్కంద మూవీ ని ఇచ్చినందుకు థాంక్యూ . తన నుంచే వచ్చే ప్రతి సినిమా కూడా తన రక్తం చెమటను చిందించడానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు రామ్.