పొలిమేర-2 దెబ్బతో లియో రికార్డుకే ఎసరు..!!

ఈ మధ్య స్టార్ హీరోల చిత్రాలు అయినా సరే ప్రేక్షకులను మెప్పించకపోతే ఆ సినిమాలను వదిలేస్తూ ఉన్నారు. చిన్న సినిమా అయినా సరే కథ పరంగా బాగుంటే ఆ సినిమాకి భారీ కలెక్షన్స్ అందుకునేలా చేస్తున్నారు ప్రేక్షకులు. అలా మొదట ఓటీటి లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం పొలిమేర. ఇప్పుడు తాజాగా పొలిమేర-2 సినిమా విడుదలై కలెక్షన్స్ పరంగా భారీగా దూసుకుపోతోంది. ఈ సినిమా కి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఒక గ్రామంలో జరిగే చేతబడి హత్యలు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.

ఈ సినిమా నిండా మలుపులతో ట్విస్టులతో సాగడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ను మంచి విజయాన్ని చేకూర్చారు. పొలిమేర-2 చిత్రానికి ఊహించని రీతిలో కలెక్షన్స్ రావడం ఇప్పుడు చాలా ట్రెండిగా మారిపోయింది. ట్రెండ్ లెక్కల ప్రకారం ఈ సినిమా మొదటి రోజే దాదాపుగా 4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అయితే ఈ సినిమా కేవలం 4 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ని మాత్రమే జరుపుకున్నట్లు తెలుస్తోంది..

మొదటి రోజు కోటి 80 లక్షలు షేర్ వసూలు రాగా నేటితో 4 కోట్ల రూపాయల మార్క్ అందుకని బ్రేక్ ఈవెన్ దాటుకుందని తెలుస్తోంది. ఓటీటి లో విడుదలైన సినిమాకి సీక్వెల్స్ థియేటర్లో విడుదలయితే ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారంటే ఈ సినిమా ఓటీటి లో ఎన్ని లక్షల మంది వీక్షించి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. కథ కథనం స్క్రీన్ ప్లే అంత బాగుండడంతో ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఈ చిత్రం నుంచి సీక్వెల్ గా 5 భాగాలు ఉంటాయని తెలియజేశారు. చూస్తూ ఉంటే పొలిమేర -2 సినిమా లియో రికార్డులను కూడా బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. ఆడియన్స్ ఎక్కువగా వస్తూ ఉండడంతో కొన్నిచోట్ల లియో సినిమాని తీసివేసి పొలిమేర-2 సినిమాని వేస్తున్నట్లు సమాచారం.