ఎన్టీఆర్ చిత్రానికి 1200 కోట్ల బడ్జెట్.. షేక్ అవుతున్న ఇండస్ట్రీ..!!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల చిత్రాలకు భారీగానే బడ్జెట్లో పెరిగిపోతున్నాయి..ఏ స్టార్ హీరో చూసినా కూడా కచ్చితంగా 100 కోట్ల బడ్జెట్ సినిమా అంటూ తెలియజేస్తూ ఉన్నారు.ఇప్పటివరకు ఎన్టీఆర్ బడ్జెట్ ఆరెంజ్ వరకు ఉండేది.. కానీ RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించడంతో తన ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఎన్టీఆర్ తో కలిసి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి సైతం నిర్మాతలు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దేవర సినిమాకి ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ కెరియర్ లోని ఈ సినిమా అత్యధిక బడ్జెట్ సినిమా అని చెప్పవచ్చు.అయితే దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ -2 సినిమాని చేయబోతున్నారు. ఇందులో హృతిక్ రోషన్ కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతోంది ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షెడ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. వార్-2 లో తన పర్ఫామెన్స్ తో ఎన్టీఆర్ చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నట్లు సమాచారం ఈ సినిమా మొదట 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో యశ్ రాజ్ ఫిలిం బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించే సినిమాలో కూడా ఎన్టీఆర్ నటించబోతున్నారు ఈ సినిమా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ వున్నారు. ఇలా ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవర, వార్ -2, ప్రశాంత్ నిల్ ఇలా మూడు సినిమాల బడ్జెట్ 1200 కోట్ల రూపాయలు అవుతోంది.. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.