ఆ మూడు సీన్స్ కోసం ” ఆది కేశవ ” థియేటర్లలో తప్పకుండా చూడాలట… మెగా ఫ్యాన్స్ బాగానే ప్రమోటింగ్ చేస్తున్నారుగా…!!

ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా రిలీజ్ అయిన మెగా హీరో సినిమా ” ఆది కేశవ “. వైష్ణవ్‌ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే యువతను బాగా ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాపై ఓ వార్త వైరల్ అవుతుంది.

అదేంటంటే… ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఎందుకు చూడాలి అనే దానిపై ఓ మూడు పాయింట్లు వైరల్ చేస్తున్నారు మెగా అభిమానులు. ఇందులో మొదటిది ఈ మధ్యకాలంలో తెరపై మనం నవ్వుకున్నది చాలా తక్కువ. ప్రతి సినిమాలోను కూడా బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అదే ఈ సినిమాలో అయితే బీభత్సంగా నవ్వుకోవచ్చు.

ఇక రెండోది ఒక హీరో ఒకపక్క క్లాస్ మరో పక్క మాస్ ఒకే సినిమాలో కనిపించి చాలా కాలమే అయ్యింది. ఇక తాజాగా ఈ సినిమాలో అది రిపీట్ అయింది. ఇక మూడోది ఏంటంటే శ్రీ లీల మా స్టెప్స్.. ఇంతకుముందు ఏ సినిమాలో చేయనటువంటి డాన్స్ చేసి ప్రేక్షకులని ఆకట్టుకుంది. అందువల్ల ఈ కారణం చేత కూడా ఈ సినిమాని చూడవచ్చట. ఇక ప్రస్తుతం ఈ మూడు విషయాలు కారణంగా తప్పకుండా మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ సినిమాని చూడాలంటూ మెగా ఫ్యాన్స్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.