గుంటూరు కారం సినిమా పేరు ఎత్తితే బూతులు తిడుతున్న శ్రీలీల.. అంత కోపం ఎందుకంటే..

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఒకేసారి అందుకోలేనన్ని సినిమా అవకాశాలను యంగ్ హీరోయిన్ శ్రీలీల అందుకుంది. 22 ఏళ్లకే సూపర్ స్టార్‌డమ్‌ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఐదు పెద్ద సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ తార రీసెంట్ గా స్కంద సినిమాతో అలరించింది. మరో నాలుగు రోజుల్లో భగవంత్ కేసరి మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీతో హిట్ కొడితే ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే షూటింగ్స్ కూడా పూర్తి చేస్తూ ఒక బీస్ట్ లాగా శ్రీలీల పని చేస్తోంది. అయితే కొందరు ఈ ముద్దుగుమ్మ అదృష్టాన్ని చూసి కుళ్ళు కొంటున్నారు. దిష్టి కూడా పెట్టేస్తున్నారు. ఏ ప్రమోషన్స్ కి వెళ్ళినా ఆమెపై ఇలాంటి కామెంట్స్ ఏ వినిపిస్తున్నాయి. అయితే అన్ని సినిమాలు ఒకేసారి చేయడం ఆశామాషి విషయం కాదని, దానిపై కామెడీ చేస్తూ హీరోయిన్ ని ఎగతాళి చేయడం ఏం బాగోలేదని శ్రీ లీల సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మండిపడింది.

అయితే భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో ఉంటే అనవసరమైన క్వశ్చన్లు అడిగి కూడా శ్రీలీలను కొంతమంది ఇరిటేట్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆమె నటిస్తున్న “గుంటూరు కారం” సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే దాని గురించి ఇప్పుడు చెప్పాలంటూ కొందరు ఆమెను భగవంత్‌ కేసరి ప్రమోషన్స్‌లో అడుగుతూ విసిగిస్తున్నారు. భగవంత్‌ కేసరి సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో ఆ సినిమా గురించి మాట్లాడటం ఏంటని తాజాగా శ్రీ లీల మండిపడింది. ఏదైనా అడగాలనుకుంటే భగవంత్‌ కేసరి సినిమా గురించే అడగండి, లేదంటే కామ్ గా ఉండండి అంటూ ఆమె ఫైర్ కూడా అయింది. మరోసారి అడిగితే బూతులు తిడుతుందేమో అని ఈ ఇంటర్వ్యూ చూసినా కొందరు కామెంట్లు చేస్తున్నారు.