మహేష్ బాబు సినిమా పై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్.. నాన్సెన్స్ అంటూ..!!

సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్‌లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ఎంతో మెసేజ్ ఉన్నటువంటి సినిమాల ద్వారా మహేష్ బాబు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. మహేష్ బాబు నటించిన మహర్షి, శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సినిమాల ద్వారా ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇక మహేష్ బాబు కూడా కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని చాలామందికి స్ఫూర్తిదాయకంగా మారాడు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమాలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా పెద్ద ఫ్యాన్ అని న్యూస్ బయటకు వచ్చింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు – కేటీఆర్ ఇద్దరు కూడా పాల్గొన్నారు. వీరిద్దరూ ఆ ఇంటర్వ్యూలో ఒకరికి సంబంధించిన ఆసక్తికర విషయం మరొకరు షేర్ చేసుకున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ మహేష్ బాబు సినిమాలు నేను చూస్తానని మహేష్ బాబు సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక మహేష్ బాబు కూడా మాట్లాడుతూ ఆయన నా సినిమాలు చూసి రివ్యూ కూడా ఇస్తారని.. సినిమా బాగుందంటే బాగుందని చెప్తారు. లేకపోతే నిర్మొహమాటంగా సినిమా బాలేదని తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు అంటూ వివరించాడు. మహేష్ ఆగడు సినిమా చూసిన కేటీఆర్ రివ్యూ ఇస్తూ అభిప్రాయాన్ని తెలియజేశారని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు ఈ సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు నటన కాస్త ఎక్సైటెడ్ గా ఉన్న అభిమానులకు క‌నెక్ట్ కాలేదు.

దీంతో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మూవీ చూసిన కేటీఆర్ తన అభిప్రాయాలను తెలియజేస్తూ స్టాప్ డూయింగ్ లైక్ థిస్ నాన్సెన్స్ అంటూ చెప్పారు.. ఇప్పటికి నాకు ఆ విషయం గుర్తుంది అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. అందుకే నేను చేసే సినిమాలు కేటీఆర్ చూస్తున్నారంటే నాకు చాలా టెన్షన్ గా ఉంటుంది అంటూ మహేష్ బాబు వివరించాడు. ప్రస్తుతం మహేష్ బాబు ఈ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.