ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోయిన్లు.. చూడ‌డానికి రెండు కళ్లు చాల‌ట్లేదు.. ఈ ర‌చ్చ ఎక్క‌డంటే..!

మామూలుగా ఫోటోలో ఒక హీరోయిన్ కనిపిస్తేనే ఫాన్స్ ఎంతో సంతోషంగా భావిస్తారు. అదే ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు హీరోయిన్స్ కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే. తాజాగా అదే జరిగింది. స్టార్ నటీనటులు కీర్తి సురేష్, ఐశ్వర్య లక్ష్మి, కల్యాణి ప్రియదర్శన్ లు ఒకే ఫ్రేమ్లో దర్శనమిచ్చి తమ అభిమానులని అట్రాక్ట్ చేసుకున్నారు.

ఈ మేరకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ” లియో ” సినిమా గురువారం రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా చెన్నైలోని వెట్రి థియేటర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో కు వెళ్లినట్లు చెప్పిన ఈ ముగ్గురు సినిమా హాల్లో తెగ సందడి చేశారు.

అంతేకాదు తమ సీట్లలో కూర్చుని దిగిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మురిసిపోయిన కీర్తి సురేష్…” FanGirls our @keerthyofficial whith @kalyanipriyan and Aishwarya mam ” అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో… ఒకే ఫ్రేమ్లో ఇన్ని అందాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.