రష్మికకు ఇన్ని భాష‌లు వ‌చ్చా.. ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాకే…( వీడియో)

రష్మిక మందన్నా ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, మాటలతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. తిరుగులేని కెరీర్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో బ్యూటిఫుల్ వీడియోతో ఫ్యాన్స్ ని అలరించింది.

నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆస్క్ మీ ఎనీథింగ్ సెషల్ నిర్వహించిన నటి ఫాలోవర్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. ఈ మేరకు ” మీరు ఎన్ని భాషలు మాట్లాడతారు?
అని ఓ అభిమాని ప్రశ్నించగా.. చేతి వేళ్ళతో వన్ టూ త్రీ కౌంట్ చేస్తూ ఫైనల్ గా ఆరు భాషల్లో మాట్లాడగలనని తెలిపింది.

కాగా ఈ వీడియోను నెట్ ఇంత షేర్ చేసిన ఆమె అభిమానులు ” యువర్ క్యూట్ నౌ 6 లాంగ్వేజెస్ ” అంటూ మురిసిపోతున్నారు. ఇక రష్మిక తాజాగా పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.