హీరోయిన్‌గా స్టార్ హీరోయిన్ కూతురు.. ఎవ‌రా హీరోయిన్‌..!

” ముందానై ముడిచ్చు ” సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది మలయాళీ హీరోయిన్ ఊర్వశీ. ఈనటి మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో కూడా నటించి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఊర్వశీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతుంది. అయితే ఈమె మలయాళ నటుడు మనోజ్ కె. జయన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

వీరికి కుంజుట్టా అనే కుమార్తె జన్మించింది. అయితే తాజాగా ఊర్వశి ఆమెతో కలిసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. కాగా ” ఈ పిక్ లో కుంజుట్టా హీరోయిన్ అయ్యే లక్షణాలున్నాయి. ఊర్వశీ వారసురాలు కచ్చితంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం.

ఊర్వశీకి కూడా తన కూతురును హీరోయిన్గా చూడాలని ఉంది కాబట్టే.. ఇన్నేళ్లకు తన ఫోటోను నెట్టింట షేర్ చేసింది “అంటూ సోషల్ మీడియాలో ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. కుంజుట్టా కథానాయకగా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి కొందరు దర్శక నిర్మాతలు కూడా ట్రై చేస్తున్నట్లు సమాచారం. కానీ దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.