“ముందు మీ కొడుకులకు అది నేర్పించండి”.. పుత్ర రత్నాలు కన్న ప్రతి ఒక్కరికి అనసుయ స్పెషల్ సజెషన్..!!

అనసూయ .. ఈ పేరుకి కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు.  జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ .. ఆ తర్వాత ఎన్నెన్నో మంచి మంచి సినిమాలో నటించి తన పేరుకి మంచి పాపులారిటీ దక్కించుకుంది . రీసెంట్గా జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసిన అనసూయ పలు సినిమాలలో నటిస్తూ ముందుకు వెళుతుంది .

ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియా లో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే అనసూయ .. రీసెంట్గా కొడుకులకు ఇంటి పనులు నేర్పించండి అంటూ పోస్ట్ చేసింది.  అమ్మాయిలకు మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా అన్ని పనులు నేర్పించాలన్న ఉద్దేశంతో ఆమె ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది . ప్రస్తుత కాలంలో ఎంతోమంది అబ్బాయిలను ఒకలా అమ్మాయిలను ఒకలా చూస్తున్నారు .

అయితే అది తప్పు అని చెప్పకనే చెప్పేసింది అనసూయ.  ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ..” మీ ఇంటిలోని మీ కొడుకులకి ఇంటి పనులు నేర్పించండి.. కనీసం కొన్ని బేసిక్ కుకింగ్.. క్లీనింగ్ స్కిల్స్ వచ్చుండాలి. ఆడ మగ అని తేడా చెప్పకండి” అంటూ పోస్ట్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో అనసూయ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది..!!