నా కొడుకుని తూ అనే తప్పు ఏం చేశాడు… ఫైర్ అయిన భోలే తల్లి….!

వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత కొత్త జనాభాతో హౌస్ కళకళలాడుతుంది. అటు నామినేషన్స్‌ కూడా మరింత రసవక్తంగా జరిగాయి. ఈవారం జరిగిన నామినేషన్స్ అయితే పీక్స్ కు వెళ్లిపోయాయి. భోలె షావలి బూతులు మాట్లాడటం.. అతడిని ప్రియాంక, శోభ ఎడాపెడ వాయించేయడం తెలిసిందే. ఈ క్రమంలో ప్రియాంక అతడిని తు అని చీదరించుకుంది. తాజాగా ఆ నామినేషన్స్ రచ్చపై భోలె షావలి తల్లి, సోదరి స్పందించారు. ముందుగా తన తల్లి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ” అంత మంచి మనసున్నవాడు, 10 మందికి అన్నం పెట్టే వాడిని హౌస్ లో అలా చూస్తా అనుకోలేదు.

నా కొడుకును ప్రియాంక తూ అని ఎందుకు అన్నాదో అర్థం కావడం లేదు. నా కొడుకు నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు. ఎక్కడికి వెళ్లినా నా కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటాడు. ఎంతో మంచి గుణం వాడిది. అతనితో హౌస్ లో ఎవరు మాట్లాడటం లేదు. తను కలుపుకుపోదామని చూస్తున్నా వాళ్లు దూరం పెడుతున్నారు ” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. భోలె షావలి చెల్లి మాట్లాడుతూ..” మా అన్నయ్య అందరిని ప్రేమిస్తాడు. కానీ తన మంచితనాన్ని ఓర్వలేక పోతున్నారు.

తనకు అతిగా మాట్లాడే అలవాటు లేదు. తనకు నటించడం రాదు. సీరియల్ బ్యాచ్ మా అన్నయ్యను కావాలని టార్గెట్ చేశారు. ప్రియాంక తూ.. అనేంత తప్పు తనేం చేశాడు. శోభా శెట్టి తనమీద పడి అరిచేస్తుంది. అంతా అవసరం లేదు. ఆ ఎపిసోడ్ చూస్తుంటే మా రక్తం మరిగిపోతుంది. కానీ ఏం చేయలేకపోయాం. శోభ, ప్రియాంక హౌస్ లో మొదటి నుంచి ఆటిట్యూడ్ చూపిస్తున్నారు. ఓవరాక్షన్ చేస్తున్నారు.

సీరియల్స్ లో నటించిన అందుకు వారికి ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ తూ అని ఊసేంత తప్పు మా అన్నయ్య ఏమి చేయలేదు. తను ఏం మాట్లాడినా తప్పులాగే చూస్తున్నారు. వాళ్లెంత ఛీ కొట్టిన మా అన్నయ్య మాత్రం కూల్గానే మాట్లాడుతాడు ” అంటూ ఫైర్ అయ్యింది.