నాగార్జున కోసం నంద‌మూరి హీరోయిన్ ఫిక్స్‌..!

అక్కినేని నాగార్జున ఓవైపు బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ ని హోస్ట్ చేస్తూ మరోవైపు సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే తన నెక్స్ట్ మూవీని యువ దర్శకుడు విజయ్ బిన్నీ తో చేయడానికి సిద్ధమయ్యాడు నాగార్జున. ” నా సామిరంగ ” టైటిల్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందునున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయ్యి నాగార్జున అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొల్పాయి.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్లూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా అసలు మ్యాటర్ ఏమిటంటే… ఈ మూవీ కోసం పలువురు హీరోయిన్స్ ని పరిశీలించిన మేకర్స్… ఫైనల్ గా కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ నీ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ఇటీవల కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అమిగోస్ సినిమాలో హీరోయిన్ గా నటించి అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ రోల్ కూడా ఉందని.. కాగా అందుకోసం మరొక హీరోయిన్ ని కూడా ఎంపిక చేసే పనిలో టీం ఉందని టాక్. ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు అతి త్వరలో వెల్లడికానుండగా… దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.