ఇటలీలో సందడి చేస్తున్న మెగా ఫ్యామిలీ.. లీకైన క్లిన్‌కారా ఫోటో..

మెగాస్టార్ చిరంజీవి నటవరసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రామ్ చరణ్. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్.. రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ తరువాత రామ్‌చరణ్ – ఉపాసన దంపతులకు క్లింకారా పుట్టిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి క్లింకారా ఫేస్‌ను రివిల్ చేయకుండా దాస్తూ వస్తున్నారు మెగా ఫ్యామిలీ.

కాగా ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిలా వివాహం ఇటలీలో గ్రాండ్గా చేసేందుకు మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ చేరుకున్నారు. ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉంటూనే మ‌రో ప‌క్క ఇట‌లీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కొణిదల, కామినేని ఫ్యామిలీ అంతా కలిసి ఒక పిక్ దిగారు. అందులో క్లింకారా ఫేస్‌ను కవర్ చేసి ఓ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది మెగా కోడ‌లు ఉపాసన. ఇందులో లవ్ ఎమోజితో క్లింకారా ఫేస్ ను కవర్ చేసింది.

అయినా వాళ్ల దిగిన ఫోటో రిఫ్ల‌క్ష‌న్‌ వాటర్ లో పడింది. దీంతో క్లింకార పిక్ రివిల్ అయిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా క్లీంకారా చాలా అందంగా ఉందంటూ. ఆమె బలే క్యూట్ గా ఉందంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది అయ్యయ్యో చెర్రీ చూసుకోవాలి కదా వాటర్ రిఫ్లెక్షన్ లో బేబి ఫేస్ కనపడిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.