రెండో పెళ్లిపై అఫీషియల్ గా స్పందించిన ప్రగతి… ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది గా…!!

సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె తల్లి, అత్త, భార్య, అక్క వంటి పాత్రలలో నటించి ఫుల్‌ పాపులారిటీ సంపాదించుకుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులతో నిత్యం హల్చల్ చేస్తుంది. అయితే ఆమె ఓ నిర్మాతను రెండో పెళ్లి చేసుకుందని గత కొద్ది కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రగతి రెండో పెళ్లి వార్తపై స్పందిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది.

అదేంటంటే..” ప్రముఖ మీడియా సంస్థ నుంచి ఇలాంటి రూమర్స్ రావడం నాకు బాధగా అనిపించింది. ఇది బాధ్యతారాహిత్యమే అవుతుంది. అక్కడ ఎంతోమంది చదువుకున్న వాళ్లు సైతం ఉన్నారు. నేను ఓ నటిని కాబట్టి.. మీరేమైనా రాయొచ్చని అనుకోవడం తప్పు. మీకేం హక్కు ఉందండి. ఒకరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అసలు మీకు అనవసరం. ఏ ఆధారం లేకుండా ఎలా రాస్తారు.. మీ గ్రూప్లో ఎవరైనా కలగని రాశారా? .. నేను దీన్ని ఖండిస్తున్నాను ” అంటూ చెప్పింది.

ప్రగతి ఇంకా మాట్లాడుతూ ” ఓ ప్రముఖ వీడియో సమస్త నుంచి ఇలాంటిది రాయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాసేముందు కాస్త పరిశీలించుకోండి. నిజ జీవితాలు తెలుసుకోండి. అలాంటి విషయమే ఉంటే అఫీషియల్ గా నేనే చెబుతాను కదా? సంస్థను చీప్ చెయ్యకండి. ఇవే కాకుండా బ్యాక్ గ్రౌండ్ కూడా చెక్ చేసుకుని మీ రాతలు రాయండి.. ఇకపై ఇలా చేయకండి ” అంటూ ఫుల్ ఫైర్ అయ్యింది ప్రగతి. ప్రస్తుతం ప్రగతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోకి నెగిటివ్ కామెంట్స్ రావడంతో.. వెంటనే ప్రగతి ఆ పోస్ట్ ని ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసింది.