సలార్ సినిమా నుంచి పృధ్విరాజ్ బర్త్ డే స్పెషల్.. అదిరిపోయిన పోస్టర్..!!

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈయన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్.. ప్రభాస్ హీరోగా ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు ..డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వ వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్లు అన్నీ కూడా ఈ సినిమా హైపుని భారీగా పెంచేస్తున్నాయి. వాస్తవానికి గత నెల లో సలార్ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ కావడం జరిగింది.

ఈరోజు పృథ్వీరాజ్ సుకుమారన్ బర్తడే సందర్భంగా సలార్ సినిమా నుంచి అదిరిపోయే లుక్కుని రిలీజ్ చేయడం జరిగింది. వరదరాజు మన్నార్ అనే పాత్రలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారుతున్నది. పృధ్విరాజ్ సుకుమారన్ మలయాళంలో మంచి పాపులారిటీ సంపాదించిన నటుడుగా పేరు సంపాదించారు .తన కెరీర్లో ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన పృథ్వీరాజ్ ఇప్పుడు సలార్ సినిమాలో విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

పృధ్విరాజ్ తిరువనంతపురంలో జన్మించారు ఈయన సుప్రియ మీనన్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. సుప్రియ బిబిసి ఛానల్ రిపోర్టర్ గా పనిచేస్తూ ఉండేదట 2011లో వీరి వివాహం జరిగింది.. వీరికి ప్రస్తుతం ఒక కుమార్తె కూడా ఉన్నది. అయితే వివాహానికి ముందు మీరాజాస్మిన్ తో పృథ్విరాజ్ రిలేషన్ లో ఉన్నట్లుగా అప్పట్లో ఎక్కువగా వార్తలు వినిపించాయి.. పృధ్విరాజ్ సుకుమారన్ తండ్రి కూడా ప్రముఖ నటుడే.. ఈయన తల్లి మల్లికా కూడా నటినేనట. ప్రస్తుతం సలార్ సినిమాకి సంబంధించి ఈ పోస్టర్ వైరల్ గా మారుతున్నది. డిసెంబర్ 22న సలార్ సినిమా రిలీజ్ కాబోతోంది.