ద‌స‌రా హిట్ తో భారీగా పెంచేసిన నాని.. `హాయ్ నాన్న‌`కు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా?

న్యాచుర‌ల్ స్టార్ నాని ఇటీవ‌ల `ద‌స‌రా` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ద‌స‌రా అనంత‌రం నాని `హాయ్ నాన్న‌` వంటి ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నారు. శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టించింది.

చైల్డ్ ఆర్టిస్ట్ కియారా ఖన్నా నాని కూతురుగా న‌టిస్తుంటే..హేశం అబ్దుల్ వహాబ్ స్వ‌రాలు అందిస్తున్నాడు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 7న పాన్ ఇండియా స్థాయిలో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. అయితే ఈ సినిమాకు నాని తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్ గా మారింది.

ద‌స‌రా ఘ‌న విజ‌యం సాధించ‌డంతో నాని త‌న రెమ్యున‌రేష‌న్ ను భారీగా పెంచేశాడు. హాయ్ నాన్న కోసం ఏకంగా రూ. 22 కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది నాని కెరీర్ లోనే హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ గా చెప్పుకోవాలి. దీంతో ఇప్పుడీ విష‌యం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక హాయ్ నాన్న హిట్టైతే నాని మ‌రింత పెంచ‌నున్నాడ‌ని అంటున్నారు.