కథ నచ్చినప్పుడు మిగతావేవీ లెక్కలోకి రావు.. కాజల్ అగర్వాల్..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చందమామ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించింది. ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. కరోనా మహమ్మరి స‌మ‌యంలో వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఒక బాబుకు జన్మనిచ్చి కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే తాజాగా రీఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల చెంత మెరుస్తుంది. ఇక తాజాగా భగవంత్ కేస‌రి సినిమాలో నటించింది.

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 19న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో కాజల్ మాట్లాడుతూ ఇంటర్వ్యూలో అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. భగవంత్ కేసరి సినిమాలో నటించడానికి మిమ్మల్ని ప్రేరేపించిన విషయాలు ఏంటి అని ఇంటర్వ్యూర్ అడ‌గ‌గా నా పాత్ర కంటే కూడా ఈ కథలోని కాన్సెప్ట్ నాకు ఎంతగానో నచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులు సమాజానికి ఎంతో అవసరమైన కథ అనిపించింది. ఇలాంటి కథలు అగ్రతార‌లు నటిస్తే ఈ సినిమా ప్రభావం ప్రేక్షకుల్లో బాగా ఉంటుందనిపించింది. ఆడపిల్లల్ని బలంగా తయారు చేయాలని అంశంపై ఇచ్చిన సందేశం చాలా బాగుంది.

దాంతో నా పాత్ర ఏమిటి అనే విషయాన్ని కూడా నేను పక్కన పెట్టి వెంటనే ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసా అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఇందులో మీ పాత్ర ఏంటి అని అడగగా కాత్యాయని.. అనే సైకియాట్రిస్ట్ గా నేను కనిపించబోతున్న. చాలా తెలివిగా ఆలోచించే సరదా పాత్ర నాది. అనిల్ రావిపూడి సినిమాలన్నీ నేను బాగా ఇష్టపడతా. అత‌డి టైమింగ్ చాలా బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చింది దీంతో కాజల్ చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్క్రిప్ట్ బాగుంటే పాత్ర ఏమిటి అనే దాన్ని కూడా పక్కనపెట్టి మరి ఆ మూవిలో నటిస్తానని కాజల్ చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.