హీరో శివ కార్తికేయన్ చాలా మోసం చేశాడంటూ మ్యూజిక్ డైరెక్టర్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌…!!

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ , స్టార్ హీరో శివ కార్తికేయన్ల మధ్య దూరం పెరిగిందనే తెలుస్తుంది. ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారన్నే రేపుతున్నాయి. అసలు ఇమ్మాన్ ఏమన్నాడంటే…” ఈ జన్మలోనే కాదు.. వచ్చే జన్మలో కూడా అతని సినిమాలకు పాటలు కంపోజ్ చేయను. అతను చేసిన మోసానికి.. క్షమాపణలు కూడా చెప్పడు.

కానీ తను క్షమించలేని మోసం చేశాడు. ఈ విషయం చాలా కాలం తరువాత తెలిసిందంటూ ” వ్యాఖ్యలు చేశాడు. ఇమ్మాన్ ఒక్కరే కాకుండా.. ఆయన మాజీ భార్య మోనిక చేసిన కామెంట్లు ఇంకోలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇమ్మాన్ మాట్లాడిన మాటలపై మాజీ భార్య మోనిక కూడా స్పందించింది. ” ఇమ్మాన్ ఏది చెప్పినా అది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం.. కానీ ఆయన చెప్పిన విధానం వల్లే తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి.

శివ కార్తికేయన్ అన్ని విలువలు తెలిసిన మంచి మనిషి. మా ఇద్దరిని కలపడానికి తను చాలా ప్రయత్నించాడు. అలాంటి మనిషి గురించి తప్పుడు మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదంటూ ” చెప్పుకొచ్చింది. అలా వీరి వ్యవహారం, ఇప్పుడు టాలీవుడ్ లో రచ్చ రచ్చగా మారింది.