`హాయ్ నాన్న` టీజ‌ర్ వ‌చ్చేసింది.. నానిపై మృణాల్ ముద్ద‌ల వ‌ర్షం.. ఇంత‌కీ రిలీజ్ ఎప్పుడంటే?

ఇటీవ‌ల ద‌సరా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న న్యాచుర‌ల్ స్టార్ నాని.. ఇప్పుడు `హాయ్ నాన్న‌` అనే ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. శౌర్యువ్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే కియారా ఖన్నా, జ‌య‌రామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న‌ ఈ సినిమాకు హిషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నాడు. అయితే తాజాగా హాయ్ నాన్న టీజ‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. కూతురు ప్రేమకు, అమ్మాయి ప్రేమకు మధ్యలో సాగే హీరో క‌థే హాయ్ నాన్న‌. స‌ర‌దాగా సాగిపోతున్న‌ తండ్రి కుమార్తెల జీవితంలోకి ఒక అమ్మాయి రావ‌డం.. అత‌నితో ఆమె ప్రేమ‌లో ప‌డ‌టం.. ఆ అమ్మాయికి అప్ప‌టికే పెళ్లి ఫిక్స్ అవ్వ‌డం వంటి స‌న్నివేశాల‌ను టీజ‌ర్ లో చూపించారు.

అలాగే టీజ‌ర్ లో నానీపై మృణాల్ ముద్ద‌లు వ‌ర్షం కురిపిస్తూ క‌నిపించింది. మొత్తానికి టీజ‌ర్ మాత్రం మ‌న‌సుకు హ‌త్తుకునే విధంగా ఉంది. లవ్, లైఫ్, ఎమోషన్స్.. ఇలా అన్ని సినిమాల్లో ఉంటాయ‌ని టీజ‌ర్ తోనే చెప్పేశారు. ఇక రిలీజ్ డేట్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట హాయ్ నాన్న సినిమాను డిసెంబ‌ర్ 21న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ, అదే స‌మ‌యానికి ప్ర‌భాస్ స‌లార్ తో వస్తున్నాడు. దీంతో హాయ్ నాన్ని రిలీజ్ ను డిసెంబర్ 7కు ప్రీ పోన్ చేశారు.