పుష్ప సినిమాలో నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం అదే.. అర్జున్ అంబటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

అర్జున్ అంబటి బుల్లితెరపై పలు సీరియల్స్ లో హీరోగా నటించాడు. ఇక తాజాగా సిల్వర్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 7లో గ‌త‌వారం కంటిప్టెంట్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా అర్జున్ అంబ‌టికి సంబంధించిన ఓ న్యూస్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ ఇంటర్వ్యూలో అర్జున్ మాట్లాడుతూ పుష్పా సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

 

పుష్ప సినిమాలో నేను కూడా ఆడిషన్స్ కి వెళ్ళానని లోపలికి వెళ్ళగానే సుకుమార్ గారు ఉన్నారని తను చూడగానే నాకు కాస్త భయం వేసిందని చెప్పుకొచ్చాడు. అయితే ఆయన మాట్లాడుతూ ఏంటి సీరియల్ అయిపోయిందా అని అడిగారు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.. ఇలా నేను నటించే సీరియల్స్ గురించి సుకుమార్ సార్ గుర్తుపడతారు, అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పుకోవచ్చాడు. ఇక తాను కూడా ఆడిషన్స్‌లో పాల్గొన్నాను అని వివరించిన అర్జున్ ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేయలేదని చెప్పాడు.

నన్ను సెలెక్ట్ చేయక‌పోవటానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు.. సుకుమార్ గారు ఏదైనా ఒక రోల్ కోసం ఆడిషన్స్ చేస్తుంటే అన్ని విధాల ఆ పాత్రకు సెట్ అవుతారు అనిపిస్తేనే సెలెక్ట్ చేస్తారు. ఒకటి లుక్స్ పరంగా కావచ్చు, మరొకటి బాడీ లాంగ్వేజ్ అయినా కావచ్చు. ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా చూసి ఆలోచించి వారిని సెలెక్ట్ చేస్తాడు. బహుశా నేను కూడా ఆయన రాసిన పాత్రకు లుక్ పరంగా సరిపోలేదేమో అందుకే నన్ను ఈ సినిమా నుంచి రిజెక్ట్ చేశారు అంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అర్జున్ చేసిన ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి.