దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. అలా యంగ్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు అభిరామ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు రెండవ కుమారుడే ఈ అభిరామ్.. రానా సోదరుడని కూడా చెప్పవచ్చు.. తన మొదటి సినిమా అహింస సినిమాతో మిశ్రమ స్పందన అందుకున్న అభిరామ్ ప్రస్తుతం వ్యాపార రంగం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా రైటర్స్ కేఫ్ అని పేరుతో ఒక కేఫ్ ను సైతం ప్రారంభించారట.
ఈ విషయాన్ని తాజాగా అభిరాయ్ తెలియజేశారు.. అంతేకాకుండా తనపై వచ్చిన వివాదాల గురించి మాట్లాడుతూ జీవితం అంత సులువుగా లేదు తమ తాతయ్య చనిపోయిన తర్వాత తనకి జీవితం విలువ అంటే తెలిసిందని ఇకపైన చాలా బాధ్యతగా ఉండాలని నిర్ణయించుకున్నాను తన కాళ్ళ పైన దాని నిలబడాలనుకున్నాను అందుకే ఈ కేఫ్ ప్రారంభించాను అంటూ తెలియజేశారు. తన మీద కాంట్రవర్సీలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతోనే కూర్చొని మాట్లాడిన రోజులు ఉన్నాయని తెలిపారు అభిరామ్.
అహింస సినిమా తర్వాత తనకు అవకాశాలు వచ్చాయని అయితే నటుడిగా తాను ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అందుకే కాస్త సమయం తీసుకుని దర్శక నిర్మాతలకు చెబుతానని పంపించానని తెలిపారు అభిరామ్.. ప్రేమ కథ చిత్రాలలో నటించాలని చాలా కోరికగా ఉందని తెలిపారు.. అలాగే తమ కుటుంబ సభ్యులు తనని దూరంగా పెట్టారని వస్తున్న వార్తల పైన రూమర్లపై స్పందిస్తూ అవన్నీ వాస్తవాలే అంటూ తెలిపారు.. ఇప్పటికీ తామంతా కలిసే ఉన్నామని తెలిపారు అభిరామ్. మరి రాబోయే రోజుల్లో నైన అభిరామ్ సరైన కథల ఎంపిక విషయంలో తగు నిర్ణయాలు తీసుకుంటారేమో చూడాలి.