`భ‌గ‌వంత్ కేస‌రి` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హ్యాట్రిక్ కొట్టాలంటే బాల‌య్య టార్గెట్ ఎంతో తెలుసా?

అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 19న ఈ సినిమా అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది.

ఈ మూవీలో బాల‌య్య‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌, బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా.. థ‌మ‌న్ స్వ‌రాలు అందించారు. సినిమాపై భారీ అంచ‌నాలు ఉండ‌టం, బాల‌య్య గ‌త రెండు చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో.. భ‌గ‌వంత్ కేస‌రికి నాన్ థియేట్రిక‌ల్‌, థియేట్రిక‌ల్ బిజినెస్ లు భారీగానే జ‌రుగుతున్నాయి.

తాజాగా ఈ సినిమా థియేట్రిక‌ల్ బిజినెస్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఒక్క నైజాంలోనే భ‌గ‌వంత్ కేస‌రికి రూ. 15 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను రూ. 59.25 కోట్ల‌కు కొనుగోలు చేశారు. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా భ‌గ‌వంత్ కేస‌రి టోట‌ల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 69.75 కోట్లు. ఈ సినిమాతో బాల‌య్య హ్యాట్రిక్ కొట్టాలంటే రూ. 70 కోట్లకు పైగా షేర్‌ వసూలు చేయాల్సి ఉంటుంది. మ‌రి ఈ టార్గెట్ ను బాల‌య్య రీచ్ అవుతాడా.. లేదా.. అన్న‌ది చూడాలి. కాగా, ఏరియాల వారీగా భ‌గ‌వంత్ కేస‌రి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌లు ఇలా ఉన్నాయి..

నిజాం: 15 కోట్లు
సీడెడ్ : 14 కోట్లు
ఉత్తరాంధ్ర: 8.2 కోట్లు
గుంటూరు: 6 కోట్లు
తూర్పు: 5 కోట్లు
పశ్చిమ: 4.2 కోట్లు
కృష్ణ: 4.25 కోట్లు
నెల్లూరు: 2.6 కోట్లు
—————————-
ఏపీ+తెలంగాణ‌=59.25 కోట్లు
—————————-

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 4.5 కోట్లు
ఓవర్సీస్: 6 కోట్లు
————————–
వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్‌= 69.75 కోట్లు
————————–