ఆ కమెడియన్‌తో శోభా శెట్టి ఘాటైన రొమాన్స్.. పిక్స్ వైరల్..

కార్తీక దీపం సీరియల్‌లో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులలో సూపర్ పాపులర్ అయ్యింది శోభా శెట్టి. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో అడుగుపెట్టి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ బుల్లితెర నటి హౌజ్‌లో ఫిజికల్ టాస్కుల్లో మగవారికి దీటుగా ఆడుతోంది. స్ట్రాటజీస్ పేరుతో జిత్తుల మారి నక్కలా కూడా వ్యవహరిస్తుంది. ఇలాంటివి ప్లస్ పాయింట్స్ అయినా ఆమెలో చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఉదాహరణకి హౌస్ లో మేకప్ వేసుకోవడానికే ఎక్కువ టైమ్‌ వేస్ట్ చేస్తోంది. అది చాలాదన్నట్టు ఇతర కంటెస్టెంట్స్ పై అనవసరంగా నోరు పారేసుకుంటుంది. నామినేషన్స్ సమయంలో కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఒక సైకో అనే పేరు తెచ్చుకుంది.

అయితే ఇతర కంటెస్టెంట్స్ తో కాస్త కోపంగా ప్రవర్తిస్తున్నా టేస్టీ తేజ తో మాత్రం ఈ ముద్దుగుమ్మ క్లోజ్‌గా మూవ్ అవుతోంది. తాజాగా అతనితో డిన్నర్ డేట్ కు కూడా వెళ్ళింది. అంతే కాదు అతడి ఒడిలో కూర్చొని రొమాంటిక్ సాంగ్ కు డాన్సులు కూడా వేసింది. మొత్తం మీద అతడితో ఘాటైన రొమాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ డిన్నర్ డేట్ కి బిగ్ బాస్ ఏ అనుమతించాడు. ఒక పేపర్ మీద లిప్ కిస్ పెట్టాలని లేడీ కంటెస్టెంట్లను కోరాడు. వారు అలాగే చేసిన తర్వాత ఆ పేపర్ పై ఉన్న లిప్ స్టిక్ గుర్తులు ఎవరి పెదాల నుంచి వచ్చాయో చెప్పాలని మగ కంటెస్టెంట్లను కోరాడు. దేనిపై ఎవరు ముద్దు పెట్టారో కరెక్ట్ గా చెబితే వారితో డిన్నర్ డేట్ కి వెళ్ళొచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

ఈ టాస్క్ లో ఆడిన టేస్టీ తేజ ఒక పేపర్ పై లిప్ కిస్ గుర్తులు చూస్తూ ఈ పెదాలు ఎవరివో ఉబ్బినట్లు ఉన్నాయి, ఇవి శోభాశెట్టివే అనుకుంటా అని అన్నాడు. అయితే అది కరెక్ట్ ఆన్సర్ అని బిగ్ బాస్ చెప్పాడు. ప్రియాంక జైన్ పెదాలను అమర్ దీప్ కరెక్ట్ గా గెస్ చేశాడు. అయితే సంచాలక్‌గా ఉన్న శివాజీ టేస్టీ తేజ ఫన్నీగా భలే ఆన్సర్ చేశాడంటూ అతడినే ఈ టాస్క్ లో విన్నర్ గా ప్రకటించాడు. దాంతో టేస్టీ తేజ శోభా శెట్టితో డిన్నర్ డేట్ వెళ్లే ఛాన్స్ కొట్టేశాడు. అనంతరం వారిద్దరూ పైన చెప్పినట్లుగా రొమాన్స్ చేసుకుంటూ సెగలు పుట్టించారు. సమ్మోహనుడా అనే పాటను బిగ్ బాస్ ప్లే చేయగా ఆ సమయంలో వీరు మరింత రొమాంటిక్‌గా ఫీల్ అయ్యారు. తేజ పై శోభ పొగడ్తల వర్షం కూడా కురిపించింది. నువ్వు చాలా అమేజింగ్, నవ్విస్తావు అంటూ అతడిని ఇంప్రెస్ చేసింది. తేజ ఆమెకు ఒక స్నేహితుడిగా లవ్ ప్రపోజ్ చేయగా దాన్ని శోభా యాక్సెప్ట్ కూడా చేసింది.