బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లోకి సీతారామం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో చాలా గొప్పగా నటించి మెప్పించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వం వహించారు. లవ్ స్టోరీ లో మరో క్లాసికల్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. సాంప్రదాయమైన పద్ధతిలో కనిపించిన మృణాల్ ఠాకూర్ సీతగా ఒక ముద్ర వేసుకుంది.
ప్రస్తుతం నానితో కలిసి హాయ్ నాన్న అనే చిత్రంలో కూడా ఈమె అలాంటి పాత్రలో కనిపించబోతోంది. అలాగే ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన కూడా డీసెంట్ రోల్స్ తోనే అలరించబోతోంది.
ఈ విషయంలో మృణాల్ ఠాకూర్ చాలా డిసప్పాయింట్ గా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తాను ఒకటి అనుకుంటే అందుకు భిన్నంగా మరొక పాత్రలు వస్తున్నాయని సమాచారం. ఇటీవల కాలంలో మృణాల్ ఠాకూర్ ఎక్కువగా హాట్ ఫోటోలతో చెలరేగిపోయి మరి కనిపిస్తోంది. సినిమాలలో ట్రెడిషనల్ గా కాకపోయినా బ్యూటీ పరంగా మాత్రం కావలసినంత బోల్డ్ నెస్ తో రెచ్చగొడుతూ ఉంటుంది.
అయితే డైరెక్టర్లు మాత్రం కేవలం సీత పాత్రలోనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారట.. ఇంస్టాగ్రామ్ లో పలు రకాల బంగిమలతో ఫోటోలకు ఫోజులు ఇస్తున్న గ్లామర్ పాత్రల అవకాశాలు రాలేదని నిరుత్సాహంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ ముద్దుగుమ్మని బోల్డ్ గా లాంచ్ చేసే డైరెక్టర్ ఒకరు కావాలని తెగ ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. వరుసగా డీసెంట్ రోల్స్ ఎక్కువగా చేయడంతో కెరీర్ కి అంత మంచిది కాదని ఒక రకమైన ఇమేజ్ దాటిన తర్వాత ఇలాంటివి పనిచేయవని ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈమె కోరిక తీర్చే డైరెక్టర్ ఎవరు వస్తారో చూడాలి మరి.