అదిరిపోయి నిర్ణయం తీసుకున్న భగవంత్ కేసరి టీం.. వారికి ఫ్రీగా సినిమా..!!

డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాలకృష్ణ హీరోగా , కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కీలకమైన పాత్రలో శ్రీ లీల నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా దసరా కానుకగా నిన్నటి రోజున గురువారం రోజు థియేటర్లో విడుదల అయింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.. అయితే ఈ ఎప్పుడూ బాలయ్య అని మాస్ హీరోగా చూపించే పాత్రలో కాకుండా ఒక మంచి మెసేజ్ తో పాటు తండ్రి -కూతుర్ల మధ్య బాండింగ్ విషయం గురించి కూడా తెలియజేయడంతో మంచి మార్కులే పడ్డాయి.

భగవంత్ కేసరి సినిమా ఏకంగా మొదటి రోజే 33 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నది. ఈ సినిమా విజయం సాధించడంతో నేడు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసి ఈ ప్రెస్మీట్లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సైతం సమాధానాలు తెలియజేయడం జరిగింది. ఈ చిత్రంలో ఒక మంచి మెసేజ్ ఉంది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు చెప్పాలని మహిళలకు తక్కువగా చూడవద్దని ఆడవాళ్లు బలంగా ఉంటారని చూపించారు. ఇలాంటి డైలాగులను బాలయ్యతో చెప్పించడంతో ఈ సినిమా పై చాలామంది బాలయ్యను పొగిడేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సినిమాలలోని మంచి మెసేజ్ పిల్లలకు చేరువేయాలని చిత్ర బృందం ఒక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా స్కూలో ఆడపిల్లలు అందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్లాలని భగవంత్ కేసరి టీమ్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే స్కూల్ పిల్లలకు ఫ్రీగా షోలు వేయబోతున్నట్లు అందుకు సంబంధించి చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ విషయం తెలిసి అటు అభిమానులు సైతం చిత్ర బృందాన్ని మెచ్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించి సమాచారాన్ని త్వరలోనే చిత్ర బృందం తెలియజేస్తుందట.