ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 7లో కెప్టెన్సీ టాస్క్ చివరి దశకు చేరుకుంది. కెప్టెన్సీ కోసం జరుగుతున్న టాస్క్ లో ఇంటి సభ్యులు రెండు టీమ్‌లుగా విడిపోయి పోటీ పడ్డారు. హౌస్ మేట్స్ ఒకపక్క స్కిట్ చేస్తూనే మధ్య మధ్యలో వచ్చే టాస్కులలో పాల్గొంటున్నారు. అలా బిగ్ బాస్ ఆసక్తికర టాస్కులు ఇచ్చి ఆటలను మరింత రసవత్తంగా మారుస్తున్నారు. ఆ చివరి టాస్క్ ఏంటంటే.. ఈ వారానికి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచి బృందంలోని సభ్యులు మిగిలిన వారిలో ఒకరిని అనర్హుడుగా ప్రకటించి అతని ఫోటోను స్విమ్మింగ్ ఫూల్ లో వేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు.
నేడు విడుదలైన బిగ్‌బాస్ ప్రోమోలో శివాజీని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి…” శివాజీ ఎలా ఉన్నారు?” అని ప్రశ్నించగా..” చాలా ఇబ్బందిగా ఉంది బిగ్‌బాస్.. ఎవరు లేకపోతే నాలో నేను ఏడుస్తున్న. ఎవరైనా ఉంటే నవ్వుతూ ఏడుస్తున్నా.. వాళ్ల అందరి ముందు ఏడవలేకపోతున్నా.. లోపల చాలా బరువుగా ఉంది ” అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
ఎక్కడ బాధ పడుతున్నాను అంటే.. ఇందాక నువ్వు ఆడలేదు అని ఇన్ డైరెక్ట్ గా అనేసరికి బాధగా అనిపించింది బిగ్ బాస్ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో చూపించిన దాని ప్రకారం శివాజీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ అతన్ని ఇంటికి పంపించేస్తారా? లేక ట్రీట్మెంట్ కోసం బయటికి తీసుకెళ్తారా? అనేది చూడాలి.