ఆట్లీనే ఫిదా చేసిన స‌న్యా… పిలిచి మ‌రీ ఏం చేశాడో చూడండి..!

తమిళ్ యంగ్ డైరెక్టర్ అట్లీ నిర్మించబోతున్న ” #VD18 ” నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వరుణ్ ధావన్ హీరోగా మురడ్ కేతాని తెరకెక్కిస్తున్న ” తేరీ ” రీమేక్ షూటింగ్ ఇటీవల మొదలైనట్లు తెలపగా.. తాజాగా ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ సన్యా మల్హోత్రా జాయిన్ అయినట్లు వెల్లడయింది.

అట్లీ దర్శకత్వం వహించిన ” జవాన్ ” సినిమాలో సన్యా ఒక కీలక రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆమె నటన నచ్చి అట్లీనే ఇందులో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ మూవీలో ఇద్దరూ కథానాయకులు కాగా కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా కనిపించనుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

అలాగే ” తేరీ ” ఒరిజినల్ వెర్షన్ తెలుగులో ” పోలీసోడు ” గా డబ్ అయిన సంగతి తెలిసిందే. ఇక మహానటి కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే… తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది.” మహానటి ” సినిమాతో ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. కెరీర్ పరంగా తిరుగులేని స్థాయిలో దూసుకుపోతుంది.