హీరోయిన్ జయప్రదకు హైకోర్టులో చుక్కెదురు.. కారణం.?

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ జయప్రదకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని అలాగే రూ .20 లక్షల పూచీకత్తు మీద డిపాజిట్ చేయమని కూడా కోర్టు ఆమెకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి గల కారణం ఏమిటి అంటే గతంలో జయప్రద చెన్నైలోనే ఒక సెంటర్లో ఒక థియేటర్ నడుపుతూ ఉండేవారు.

అప్పట్లో అందులో పనిచేసే ఉద్యోగులకు ఈఎస్ఐ చెల్లించలేదని కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే అదంతా నిజమేనని నిర్ధారణ కావడంతో మద్రాస్ హైకోర్టు జయప్రద కి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో జయప్రద తో పాటు మరో ముగ్గురికి కోర్టు 6 నెలల పాటు జైలు శిక్ష కూడా విధించింది. ఈ క్రమంలోనే జయప్రద కోర్టు శిక్ష రద్దు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. మరి కోర్టు ఈ విషయంపై ఏ విధంగా తీర్పునిస్తుందో అని ఇప్పుడు అభిమానుల సైతం ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు.

ఇక జయప్రద విషయానికి వస్తే.. ఒకానొక సమయంలో శ్రీదేవితో సహా పోటీపడి అందం విషయంలో అంతకుమించి పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఊహించని రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సీనియర్ హీరో లతో జతకట్టి భారీ క్రేజ్ దక్కించుకున్న జయప్రద సినిమాలలో అవకాశాలు క్రమంగా తగ్గుతున్న సమయంలో రాజకీయాల వైపు అడుగులు వేసింది. ఇక ఒకవైపు సినిమా జీవితం మరొకవైపు రాజకీయాలలో కూడా చక్రం తిప్పింది ఈ ముద్దుగుమ్మ..