అమ్మనే నాకు స్పూర్తి.. అన్నీ అమ్మకు నచ్చితేనే .. షారుఖ్ కూతురు కామెంట్స్ వైర‌ల్..!!

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ తన తల్లిని అడగనిదే ఏ పని చెయనంటోంది. ” ది అర్చీస్ ” తో బాలీవుడ్లోకి అడుగుపెడుతున్న ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో పర్సనల్ అండ్ కెరీర్ విషయాలు షేర్ చేసుకుంది. ” ఇంగ్లాండులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే న్యూయార్క్ లో యాక్టింగ్ స్కూల్లో నటనలో శిక్షణ తీసుకున్నా.

స్కూల్, కాలేజీలోనూ వివిధ రకాల కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనే దాన్ని ” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఫ్యాషన్, డ్రెస్సింగ్ గురించి చెబుతూ..” నా దుస్తులు ఇతరత్రా యాక్సెసిరీస్‌లన్నీ కాస్త ఖరీదైనవే. ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ట్రెండీ డ్రెస్సులు ఇష్టపడతా. అయితే అమ్మానాన్నల గైడెన్స్ తోనే ప్రతి అడుగు వేస్తాను.

నా హెయిర్ స్టైల్ దగ్గర నుంచి.. డ్రెస్సింగ్ స్టైల్ వరకు అన్ని అమ్మనే అడుగుతాను. తను ఓకే అంటేనే నాకు ఓకే. ప్రొడ్యూసర్ అండ్ ఇంటీరియర్ డిజైనర్ గా రాణిస్తున్న ఆమ్మే నాకు స్ఫూర్తి ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుహానా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.