Saidaram Tej బర్త్డే స్పెషల్ : రూ.100 కోట్ల కలెక్షన్ రాబట్టిన సాయి ధరమ్ తేజ్ సినిమా ఏంటో తెలుసా..?

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసి తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండడంతో హీరోగా అడుగుపెట్టాడు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , సుప్రీమ్, తిక్క వంటి చిత్రాల్లో నటించాడు.

అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హీరోగా దూసుకుపోతున్న సమయంలో తేజ్ బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ యాక్సిడెంట్ తేజ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అయితే ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత తేజ్ మాట్లాడేందుకు కొన్ని రోజులపాటు ఇబ్బంది పడ్డాడు.. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని ” విరూపాక్ష ” సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఈ మూవీ తేజ్ కు సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 100 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. ఇక ప్రస్తుతం తేజ్ తన కొత్త ప్రాజెక్ట్ సంపత్ నందితో చేస్తున్నాడు. నేడు సాయి ధరమ్ తేజ్ తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.