” జాన్వీ తో చచ్చిన అలాంటి పని చేయను” తెగేసి చెప్పిన తెలుగు హీరో.. ముంబై బ్యూటీ పై అంత నమకమ్మా..?

సినిమాలో ఈ మధ్యకాలం వచ్చే సినిమాలో కథ , కంటెంట్ కన్నా లిప్ లాక్ .. బెడ్ సీన్స్..  బాత్రూం సీన్స్ ఎక్కువగా ఉంటున్నాయి.  మరీ ముఖ్యంగా యువత అలాంటి సీన్స్ చూసి అట్రాక్ట్ అవుతుంది . ఆ కారణంగా సినిమా చూడడానికి థియేటర్స్ కి వస్తున్నారు జనాలు. తద్వార మేకర్స్ కిడబ్బులు వస్తున్నాయి . ఇక మేకర్స్ అలాంటి సీన్స్ తెరకెక్కించకుండా ఎలా ఉంటారు ..? చెప్పండి .

అందుకే అలాంటి సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు కొందరు డైరెక్టర్లు . అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి సీన్స్ మరింత ఘాటు స్థాయిలో ఉంటాయి . అలాంటి ట్రెండ్ ని మన తెలుగులో కూడా ఫాలో అవుతున్నారు డైరెక్టర్లు.  ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్న జాన్వికపూర్ తో తెలుగు హీరోని పెట్టి ఓ లవ్ రొమాంటిక్ సినిమాను డిజైన్ చేశారట ఓ డైరెక్టర్ . బోనీ కపూర్ కి ఈ తెలుగు డైరెక్టర్ బాగా పరిచయం కావడంతో జాన్వికపూర్ ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఓకే చేశారట .

అయితే ఈ సినిమాలో నటించడానికి యంగ్ తెలుగు హీరో మాత్రం రిజెక్ట్ చేశారట.  ఆయనకు పెద్దగా క్రేజ్ లేదు ఇప్పుడిప్పుడే పాపులారిటీ దక్కించుకుంటున్నారు . అయినా సరే జాన్వికపూర్ తో లిప్ లాక్ సీన్స్ చేయడానికి అస్సలు ఇష్టపడలేదట . దానికి రీజన్ శ్రీదేవి పై ఉన్న అభిమానమే.  శ్రీదేవి కి నేను బిగ్ ఫ్యాన్ మరి అలాంటిది.. ఆమె కూతురుతో నేను అలా ఎలా చేయగలను సినిమాలో అవకాశం ఇవ్వకపోయినా పర్లేదు నేను చేయను అంటూ సినిమా రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడట .  దీంతో ఈ యంగ్ హీరో శ్రీదేవి రియల్ ఫ్యాన్ అంటూ జనాలు రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!