అల్లు శిరీష్ ప్రేమ వ్యవహారమే అతనిని ఇంతకాలం పెళ్లికి దూరం చేసిందా?

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మూడో కుమారుడు అల్లు శిరీష్ గురించి గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నటుడు అల్లు శిరీష్ కంటే అల్లు అరవింద్ తన రెండవ కుమారుడు అల్లు అర్జున్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని, అందువల్ల అల్లు శిరీష్ బాగా డిసప్పాయింట్ అవుతున్నాడని ప్రచారం సాగుతోంది. అలాగే అల్లు శిరీష్‌కి తీవ్రమైన అనారోగ్యం ఉందని, దాంతో పెళ్లి కూడా జరగడం లేదని మరి కొందరు పుకార్లు సృష్టించారు. శిరీష్ కుటుంబ సభ్యులతో గొడవలు పడి ఇల్లు వదిలి ఆస్తిలో వాటా దక్కించుకోవాలనుకుంటున్నాడంటూ పుకార్లు కూడా కొందరు పుట్టించారు.

అయితే, ఈ పుకార్లు నిజం కాదని సినీ సర్కిల్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం తెలుస్తోంది. అల్లు శిరీష్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం.. అతడు తండ్రికి నచ్చని అమ్మాయిని ప్రేమించడమే అని అంటున్నారు. అల్లు శిరీష్ తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయాలని తన తండ్రిని ఒప్పించడానికి చాలాసార్లు ప్రయత్నించాడట, కానీ అతను ఎప్పుడూ ఈ ప్రస్తావని తెచ్చినా ఆ అమ్మాయి వద్దు అంటే వద్దు అని వాదిస్తున్నాడట.

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం ఒంటరిగా ఉంటానని అల్లు శిరీష్ ఏకంగా తండ్రినే బెదిరించాడట. కొన్నిసార్లు టెన్షన్, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇంటిని విడిచిపెట్టి బయటికి వెళ్తున్నాడు అని కూడా అంటున్నారు, తాత్కాలికంగా బయటికి వెళ్లిపోయిన శాశ్వతంగా వారికి దూరం మాత్రం కావట్లేదట. అతను తన కుటుంబం నుండి విడిపోవడానికి ఇష్టపడటం లేదట. ఏదో ఒక రోజు తన తండ్రి తన ప్రేమను, ప్రియురాలను అంగీకరించి తమ వివాహాన్ని చేస్తాడని, మంచి మనసుతో ఆశీర్వదిస్తాడని అతను ఆశిస్తున్నాడట. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది.