మీరు తిట్టాలంటే పవన్ కళ్యాణ్ ను తిట్టండి.. నా కుటుంబాన్ని లాగొద్దు.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్..!!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమె గత కొద్దికాలంగా సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు చేస్తుంది. అయితే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 20న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక రేణు దేశాయ్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది.

తాజాగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ” నేను ఎప్పుడూ విడాకుల గురించి మాట్లాడినా.. నా మాజీ భర్త పవన్ కళ్యాణ్ అభిమానులు.. నేను వేరే పార్టీలకు అమ్ముడు పోయానని చెప్పుకొచ్చేవారు. పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా మాట్లాడితే.. ఈ పార్టీకి అమ్ముడుపోయాను అని చెప్పుకొచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కావాలనుకుంటున్నారు. ప్రపంచంలో ఎవరైనా ఆయన గురించి కామెంట్ చేయొచ్చు. మేనిఫెస్టో బాగోలేదని, ఆయన మాట్లాడే మాటలు బాగోలేదని.. స్పీచ్ లు బాగోలేదని తిట్టండి.

కానీ అందులోకి కుటుంబాన్ని లాగకండి ” అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమె గురించి తప్పుగా మాట్లాడే వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ” ఒక కుటుంబం పరువు మొత్తం ఒక మహిళ రెండు కాళ్ళ మధ్య ఉంటుంది అంటే అది చాలా దురదృష్టం. నా నటన గురించి కానీ, నా డ్రెస్సింగ్ గురించి కానీ కామెంట్ చేయ్యకుండా.. ఎంతమందితో పడుకుంది. ఇలా చేసింది.. అలా చేసిందని క్యారెక్టర్ పై మాటలు అంటారు. అది పద్ధతి కాదు ” అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ అయింది.