త్వరలోనే కిరణ్ అబ్బవరం పెళ్లి..? ఆ హీరోయిన్ తోనే.. పేరుతో సహా చెప్పేశాడుగా (వీడియో)..!!

వామ్మో.. ఏంటిది ఒకరి తర్వాత ఒకరు స్టార్ హీరోలు అందరూ వరుసగా హీరోయిన్స్ తో ప్రేమాయణాలు నడిపేస్తున్నారు. రీసెంట్ గానే హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిన పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆ తర్వాత వెంటనే మెగా ఫ్యామిలీలో మరో హీరో కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు . అది కూడా ఓ హీరోయిన్ ని అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం కూడా హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది .

పలు షాట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ దక్కించుకున్న కిరణ్ అబ్బవరం రాజావారు రాణి గారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం రీసెంట్గా ఆషూ రెడ్డి తో కండక్ట్ చేసిన దావత్ అనే షోకు గెస్ట్ గా వచ్చాడు. ఈ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది . ఈ ప్రోమోలో పలు విషయాలను ఓపెన్ గా చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం .

అయితే ఆశు రెడ్డి కిరణ్ అబ్బవరంతో ,,మీరు రహస్య గోరక్ తో రిలేషన్షిప్ లో ఉన్నారా..? అని అడగ్గా తెగ సిగ్గుపడిపోయాడు. అంతే కాదు కిరణ్ సమాధానం ఇస్తూ “అలాంటిదేమీ లేదు.. ఉంటే మేమే చెప్తాం “అని అన్నాడు. దీంతో వెంటనే ఆశురెడ్డి ..”మేము అంటే ఇద్దరు కలిసి డేట్ అనౌన్స్ చేస్తారా ..?” అంటూ అశురెడ్డి ప్రశ్నించింది . దీంతో కిరణ్ సిగ్గుపడిపోతూ..” నిజం చెప్తున్నాను ఇన్నాళ్లు ఎప్పుడు ఇంటర్వ్యూలో దొరికిపోలేదు ఈ షోలో ఏంటి ఇలా దొరికిపోయాను అని సిగ్గు పడిపోయాడు”. దీంతో అక్కడ ఉండే జనాలు సైతం ఓ ఓ అంటూ ఓ రేంజ్ లో అరిచారు. దీంతో అనఫీషియల్ గా రహస్య గోరక్ తో ప్రేమాయణాన్ని కన్ఫామ్ చేసేసాడు కిరణ్ అబ్బవరం . పెళ్లి డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!