మెగా హీరోని డామినేట్ చేస్తున్న శ్రీలీల.. అందరిదీ అదే ప్రాబ్లం అంటున్న నేటిజన్స్..

శ్రీ లీల ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి క్రేజ్ లో కొనసాగుతుంది.ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో ఏకంగా 10కి పైగా సినిమాలు ఉన్నాయి. ఇక డాన్స్ విషయానికొస్తే ఈ బ్యూటీకి తిరిగే లేదు.

అయితే డాన్స్ విషయంలో శ్రీ లీల కుర్ర హీరోలకు గట్టి కాంపిటేషన్ ఇస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతుందని సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు చేస్తున్నారు. ” ఆది కేశవ ” సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఆ పాట కూడా ” లీలమ్మ.. ” అంటూ సాగుతుంది.

తేజ్ కేవలం అందులో సపోర్టింగ్ రోల్ లా అనిపిస్తుంది. ఈ హీరో కూడా మంచి డాన్సరే. కాకపోతే ఈ బ్యూటీ వైష్ణవ్‌ తేజ్‌ను డామినేట్ చేసింది. దీంతో మెగా హీరోని డామినేట్ చేస్తున్నావా శ్రీ లీల అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది వైష్ణవ్ తేజ్ ని కాదు యంగ్ హీరోల అందరిదీ ఇదే పరిస్థితి. శ్రీ లీల టాలీవుడ్ యంగ్ హీరోల అందరికీ గట్టి కాంపిటేషన్ ఇస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.