Biggboss7: ఈవారం కూడా భరించక తప్పదా..?

బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రశాంత్ – గౌతమ్, శోభా – భోలే – ప్రియాంక మధ్య ఫైట్ వాడివేడిగా జరుగుతోంది. ముఖ్యంగా ఈ గొడవలో ఎవరికి వారు తగ్గకుండా మరీ పోటీ పడుతున్నారు. దీంతో ఈ వారం నామినేషన్స్ కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఎనిమిదో వారం నామినేషన్ లో భాగంగా మొత్తం ఎనిమిది మంది నామినేట్ అవ్వగా.. వారిలో భోలే షావలి, శివాజీ, అమర్ దీప్ , ఆట సందీప్, గౌతం కృష్ణ, అశ్విని శ్రీ, శోభా శెట్టి , ప్రియాంక జైన్ ఉన్నారు.

అయితే ఎప్పటిలాగే ఈసారి ఓటింగ్ లు కూడా తారుమారు అయ్యాయి. తాజా ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో అత్యధిక ఓట్లతో శివాజీ ఉండగా.. రెండవ స్థానంలో అమర్ కొనసాగుతున్నారు. ఇక మూడవ స్థానంలో అనూహ్యంగా భోలే కొనసాగుతూ ఉండడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం .ఇక నాలుగో స్థానంలో గౌతం, ఐదవ స్థానంలో ప్రియాంక, ఆరవ స్థానంలో సందీప్, ఏడవ స్థానంలో అశ్విని కొనసాగుతున్నారు. చివరి స్థానంలో శోభా శెట్టి కొనసాగుతోంది.

 

వాస్తవానికి హౌస్ లో ఈమె ర్యాష్ గా బిహేవ్ చేస్తుండడం వల్లే ఓట్లు కూడా సరిగ్గా పడడం లేదని మాటలు వినిపిస్తున్నాయి. అయితే శోభ ఉంటేనే అక్కడ షో మరింత రసవత్తరంగా సాగుతుంది అని ఆలోచించేవారిసంఖ్య కూడా ఎక్కువైంది. కాబట్టి వారాంతానికి ఇంకా రెండు మూడు రోజులు మిగిలి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓట్లు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మరి కొంతమంది ఏమో శోభ ఈసారి తప్పకుండా ఎలిమినేట్ అవుతుంది అని కామెంట్లు చేస్తూ ఉండగా ఈసారి కూడా అమ్మాయినే పంపిస్తారా అంటూ మరొకవైపు విమర్శలు గుప్పిస్తున్నారు నేటిజెన్లు. ఇప్పటికే అమ్మాయిలు వరుసగా వారానికొకరు చొప్పున వెళ్ళిపోతూ ఉండగా అబ్బాయిలు ఒకరు కూడా ఎలిమినేట్ కాలేదు. అందుకే ఈసారి కూడా హౌస్ నీ బాయ్స్ హాస్టల్ లాగా మార్చేస్తున్నారు .. అబ్బాయిలను భరించక తప్పదా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈసారి అటు ఆడియన్స్ ఇటు బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.