చిరు సినిమా ట్రైల‌ర్ వ‌చ్చేసింది… న‌వ్వి న‌వ్వి చావాల్సిందే ( వీడియో)

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు చెప్తేనే ప్రజల్లో పూనకాలు వస్తాయి. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ ని దక్కించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో శంకర్ దాదా ఎంబిబిఎస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చిరంజీవిలోని కామెడీ యాంగిల్ ను పూర్తిగా వాడి డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ సక్సెస్ అయ్యారు.

అప్పట్లో ఈ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరు తో పాటు మరో హీరో శ్రీకాంత్ కూడా ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. 2004లో విడుదలైన ఈ మూవీలో చిరు, శ్రీకాంత్ లు పండించిన హాస్యానికి ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు.

అయితే ఇప్పటి తరానికి ఆ హ్యాపీనెస్ ని మరోసారి చూపించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. నవంబర్ 4న ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఇవాళ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. చిరు హాస్య విశ్వరూపాన్ని మరోసారి తెరపై చూసేందుకు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు చిరు ఫ్యాన్స్.