బిర్యానీ ఆకుల వల్ల ఉపయోగాలు తెలిస్తే వదలరు..!!

మనం ఏదైనా ఫంక్షన్స్ పార్టీకి వెళ్లిన కచ్చితంగా బిరియాని వంటివి చేస్తూ ఉంటారు. అయితే అందులోకి బిర్యాని ఆకులు వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అలాగే ఇళ్లల్లో పలావ్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరలలో కూడా ఎక్కువగా వీటిని వినియోగిస్తూ ఉంటారు. మసాలాలు తయారు చేయడానికి బిర్యానీ ఆకులను కచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల టెస్ట్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆ వంటకం రుచి వాసన కూడా బాగా వేస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ బిర్యానీ ఆకుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

ఈ బిర్యానీ ఆకులలో యాంటీ క్యాన్సర్ యాంటీ ఆక్సిడెంట్ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.. బిర్యానీ ఆకుతో పలు రకాల ఇన్ఫెక్షన్స్ రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గించుకోవచ్చు.

క్యాన్సర్ కారకాలను సైతం దూరం చేసే ఎన్నో ఔషధ గుణాలు బిరియాని ఆకులో లభిస్తాయి.. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ వంటి వాటిని దూరం చేస్తుంది.

ఎక్కువగా జుట్టు రాలేవారు ఈ బిరియాని ఆకుతో వాటిని పెట్టవచ్చు. బిర్యానీ ఆకులు వేసి మరిగించిన నీటితో జుట్టుని శుభ్రం చేసుకుంటే ఇందులో ఉండే స్కాల్ జుట్టును పాడవకుండా చేస్తుందట.

ఎవరికైనా శ్వాసకోస సమస్యలు ఉన్నవారు బిరియాని ఆకుతో చేసేటువంటి కషాయాన్ని తాగడం వల్ల ఊపిరితిత్తులు చాలా ఫ్రీగా మారుతాయి.శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బంది గురక చాతి నొప్పి సమస్యలను కూడా దూరం చేస్తుందట.

బిర్యానీ ఆకులు పలు రకాల ఔషధ గుణాలు ఉండటంతో పాటు ఈ ఆకును ఆయుర్వేద ఔషధములలో కూడా వినియోగిస్తూ ఉంటారు. బిర్యానీ ఆకులు పచ్చిగా ఉన్నప్పుడు కంటే ఎండిన తర్వాతే ఔషధ గుణాలు మెరుగ్గా ఉంటాయట.